Saturday, November 23, 2024

ప్రతి గ్రామానికి నెట్ సేవలు – జగన్ కు నీతి అయోగ్ ప్ర‌శంస‌లు..

అమరావతి: ఎపిలోని ప్ర‌తి గ్రామానికి ఇంట‌ర్ నెట్ సేవ‌లు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని జ‌గ‌న్ పేర్కొన‌డం ప‌ట్ల నీతి అయోగ్ ప్ర‌శంసించింది.. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలకు సంబంధించి సీఎం తీసుకున్న నిర్ణయాన్ని నీతిఆయోగ్ స్వాగతించింది. ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి ఇంటర్నెట్ సేవలను అందించేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టనున్న భారత్ నెట్ ప్రాజెక్టును ప్రశంసించింది. భారత్ నెట్ ప్రాజెక్ట్‌ పేరుతో సీఎం జగన్ తీసుకొస్తున్న పథకాన్ని అభినందించింది. కాగా.. భారత్ నెట్ ప్రాజెక్ట్ పేరుతో డిజిటల్ పబ్లిక్ లైబ్రరీలను తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామ‌ని సీఎం జగన్ తన ట్వీట్‌లో తెలిపారు. నిరంతర ఇంటర్నెట్‌ను అందించడం ద్వారా వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ గ్రామస్థాయి నుంచి అమలు చేసేందుకు కృషి చేస్తామని జగన్‌ తెలిపారు. ఈ నేప‌థ్యంలో జగన్ చేసిన ట్వీట్‌ను నీతిఆయోగ్ రీట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement