Tuesday, November 19, 2024

9 రోజులు ఎపి అసెంబ్లీ – 16న రాష్ట్ర బ‌డ్జెట్…

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు 9 రోజుల పాటు జరగనున్నాయి . స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జ‌రిగిన‌ బీఏసీ సమావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.. . ఈ నెల 16న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు మీడియాతో మాట్లాడుతూ, రేపు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. బడ్జెట్‌ సెషన్‌ కావడంతో శని, ఆదివారాల్లోనూ(18,19) సమావేశాలు కొనసాగుతాయన్నారు. 21, 22 అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ ప్రవేశపెడతామన్నారు. ‍ప్రతిపక్ష నేతను కూడా సభకు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతిపక్షం లేవనైత్తే అంశాలపై చర్చకు సిద్ధమని ప్రసాదరాజు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement