మంగళగిరి, (ప్రభ న్యూస్) : మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని మంగళగిరి నిడమర్రు రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ గా మారింది. నిడమర్రు, నీరుకొండ, కురగల్లు, తదితర గ్రామాలకు ప్రత్యేకించి అమరావతి టౌన్ షిప్ కు చేరుకోవాలంటే ఈ రహదారి కీలకం. నవులూరు రైల్వే గేటు మూతపడిన తరువాత నుండి ఇటుగా వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. ఆయితే రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాల వేగ నియంత్రణ లేకపోవటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైలు గేటు తీసిన సందర్భాల్లో ఒక్క సారిగా పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. దీంతో అదే సందర్భంలో ఇక్కడ ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు రోడ్డు దాటవలసి రావటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రైతు బజార్, వ్యవసాయ మార్కెట్ యార్డు, అరవింద హైస్కూల్, కేరళ పబ్లిక్ పాఠశాల లున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కనీస చర్యలు తీసుకోకపోవడం ప్రజల పాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా ఆర్ అండ్ బీ శాఖ స్పందించి స్పీడ్ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital