Tuesday, November 26, 2024

NIA – శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

శ్రీకాకుళం, అక్టోబర్ 2: మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న సమాచారంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఉదయం ఐదు గంటల నుంచి పలు గ్రామాల్లోని పలువురు వ్యక్తుల ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు . శ్రీకాకుళం జిల్లా.. ప‌లాస మండలం.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు సోమవారం ఉదయం సోదాలు నిర్వహించారు. పలాస మండలం మాకన్నపల్లి గ్రామానికి చెందిన సాలిన వీర, వజ్రపుకొత్తూరు మండలం గడూరు గ్రామానికి చెందిన జోగి కోదండ ఇళ్లలో ఏకధాటిగా సోదాలు నిర్వహించగా జోగి కోదండ ఇంట్లో కొన్ని పుస్తకాలు లభించినట్లు సమాచారం.

అదేవిధంగా టెక్కలిలో కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) అధికారులు సోదాలు చేశారు. కుల నిర్మూలన పోరాట సమితి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకర్ రావు ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. టెక్కలికి సమీపంలోని మునసబ్ పేటలో ప్రస్తుతం ఆయన ఉంటుండ‌గా.. అక్కడికి ఎవరినీ పోనీయకుండా టెక్కలి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో ఎన్ఐఏ సోదాలు

- Advertisement -

అనంతపురం జిల్లాలో ఎన్ఐ ఏ సోదాలు నిర్వహించారు. నగరంలోని బిందెల కాలనీలో నివాసం ఉన్న ఒక ఉపాధ్యాయుడు ఉదయం నుంచి తనికి నిర్వహించి కొన్ని డాక్యుమెంట్లను తీసుకెళ్లినట్లు సమాచారం. మరికొన్నిచోట్ల రహస్యంగా సోదాలు నిర్వహించారు. జిల్లా పోలీసులు పూర్తిస్థాయిలో భద్రత కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement