ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఇవ్వాల (శుక్రవారం) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రజా సంఘాలకు చెందిన నేతలతో పాటు గతంలో మావోయిస్టులకు సానుభూతిపరులుగా పనిచేసిన వారి ఇళ్లే టార్గెట్గా ఈ సోదాలు జరిగాయి. ఇందులో భాగంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. చాపకింద నీరులా మరోమారు మావోయిస్టులు బలం పుంజుకుంటున్నారని, ఈ క్రమంలోనే తమ సంస్థలోకి భారీగా రిక్రూట్మెంట్లు జరుపుతున్నారన్న సమాచారంతో ఎన్ఐఏ రంగంలోకి దిగినట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ రాష్ట్రంలో కూడా ఇదే కారణంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
ఏపీలో ఎన్ఐఏ సోదాల కలకలం.. మావోయిస్టులకు హెల్ప్ చేస్తున్నారన్న అనుమానం
Advertisement
తాజా వార్తలు
Advertisement