Friday, November 22, 2024

మాజీ ఎమ్మెల్యేల హత్య కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్

అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ) అధికారులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు కళావతి అలియాస్ భవానీపై విజయవాడ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కిడారి సర్వేశ్వరరావును 40 మంది హత్య చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. కిడారి హత్యలో కళావతి కీలక పాత్ర పోషించారని ఎన్ఐఏ పేర్కొంది. హత్య చేసేందుంకు అవసరమైన లాజిస్టిక్స్ ను మావోయిస్టులకు కళావతి సరఫరా చేసినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. మావోయిస్టు స్టేట్ కమిటీ మెంబర్ కాకూరి పెద్దన్న భార్య కళావతి అని ఎన్ఐఏ చెబుతోంది. హత్య చేసిన సమయంలో ఇన్ సాస్ రైఫిల్ తో పాటుగా పలు మారణాయుధాలను కళావతి ధరించిందని పేర్కొంది. కిడారి, సివేరి సోమ హత్యలకు పదిహేను రోజుల ముందు డుంబ్రిగూడలో రెక్కీ నిర్వహించిన బస చేశారని తెలిపింది. ఈ కేసులో 9 మంది మావోయిస్టులపై ఎన్‌‌‌‌‌ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌‌లో కళావతితో పాటు మొత్తం 40 మందిని పేర్లను ఎన్‌ఐఏ పేర్కొంది.

కాగా, 2018లో కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేసిన విషయం తెలిసిందే. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తన అనుచరులతో కలిసి వెళ్తున్నవాహనాన్ని డుంబ్రీగూడ మండలం లిప్పిటిపుట్ట దగ్గర మావోయిస్టులు అడ్డగించారు. ఆ తర్వాత ఆయనను కిందికి దించి అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతోపాటు సివేరి సోమ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement