ఆంధ్రప్రభ స్మార్ట్, ఢిల్లీ : అచ్యుతాపురం సెజ్‌లో ఎస్సెన్షియా ఫార్మా ఘటనను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు సుమోటోగా కేసు నమోదు చేసింది. కాగా, దీనికి సంబంధించి శుక్రవారం డీజీపీ తిరుమలరావు, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్టు,స్టేట్ మెంట్స్ కావాలని కోరింది. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీసింది. మృతుల వివరాలు పూర్తిగా తెలియజేయాలని ఎన్‌హెచ్‌ఆర్సీ కోరింది.
- Advertisement -