Friday, November 22, 2024

Krishna: కొత్త టెక్నాలజీ బోట్లతో మత్స్యకారులకు ఎంతో ఉపయోగం… కిరణ్ రిజిజు

కొత్త టెక్నాలజీతో బోట్లను తీసుకురావడం వలన మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అండ్ భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ శాఖల సమన్వయంతో మత్యకారులకి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బందరు ఎంపీ బాలసౌరి, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మత్యకార సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… మత్స్యకారులకు సముద్రంలో ఏ విధంగా చేపల వేట చేయాలి, సముద్రంలో ఏ ప్రదేశంలో ఎక్కువగా మత్యసంపద లభ్యమవుతున్నాయి, సముద్రంలో అలల ఉధృతి ఏ విధంగా ఉన్నది లాంటి విషయాలను ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే విధంగా భారత ప్రభుత్వం ఆజాదిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా యాప్ లు తయారుచేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం నిర్వహించే నాలుగు వర్క్ షాపులలో మొదటి అవగాహన సదస్సు మచిలీపట్నంలో నిర్వహించినందుకు మచిలీపట్నం ప్రజల తరఫున బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మత్స్యకారుల సంక్షేమానికి అవసరమైన సమాచార వ్యవస్థను ఒక యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అందించడం కోసం స్వామినాథన్ ఫౌండేషన్ తరపున శాస్త్రవేత్తలు ప్రకృతి విపత్తుల గురించి సముద్ర స్థితిగతుల గురించి సమాచారం అందించే తీరు ప్రశంసనీయమని ఎంపీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement