Friday, November 22, 2024

ఎపిలో మ‌ద్యం సీసాల‌పై కొత్త ముద్ర‌లు.. క‌ల్తీ మ‌ద్యం అనే అనుమానాలు..

అమరావతి, ఆంధ్రప్రభ: మద్యం అమ్మకాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రభుత్వ మద్యం షాపులు.. బార్లలో మాత్రమే అమ్మాల్సిన మద్యం రెస్టారెంట్లు, కిళ్లి బంకుల్లో అమ్ముతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల వంటి ప్రాంతాల్లో దేవస్థానం ప్రాంగణాల్లోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా మద్యం బహిరంగ అమ్మకాలు పెరిగాయి. కొందరు వ్యాపా రులు సిండికేట్‌గా మారి మండలాల వారీగా పంచుకు న్నా రు. ఈ ఒప్పందంలో భాగంగా ఒకరి ప్రాంతంలో మరొకరు రాకుండా కట్టుబాట్లు పెట్టుకున్నారు. ఇందుకోసం మద్యం బాటిళ్లపై కొత్తగా రబ్బరు ముద్ర(సీలు) వేస్తున్నారు. ఇతర ప్రాంతాల మద్యం అక్కడ అమ్మకుండా నిలువరించేందుకు బాటిళ్లపై సీళ్లు(రబ్బరు ముద్ర) వేస్తున్నట్లు తెలిసింది. ఆ సీళ్లు ఉన్న మద్యం అమ్మకాలపై అటు ఎక్సైజు..ఇటు పోలీ సులు కూడా దాడులు చేసేందుకు అవకాశం లేదని విశ్వస నీయ వర్గాల సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం బాటిళ్లపై కొత్త సీళ్లు దర్శనం ఇస్తుండటంతో తాగేది అసలో..నకిలీనో తెలియక మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. రేపు జరగరానిది జరిగితే బాధ్యులెవరనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ..గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ అమలు చేస్తున్నారు. మద్యం షాపులు, బార్లకు వేర్వేరు విధానాలు రూపొందించారు. కొత్త మద్య విధానంలో భాగంగా షాపులను ఏపీబీసీఎల్‌(ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌) నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యా ప్తంగా 2,934 మద్యం షాపులు ఉండగా..మరో 800 వంద ల వరకు టూరిజం ప్రాంతాలు, వాక్‌ ఇన్‌ స్టోర్స్‌ ఉన్నాయి. ఇటీవలే కొత్త బార్లకు లైసెన్స్‌లు కూడా మంజూరు చేశారు.


అంతా బహిరంగమే..
రాష్ట్రంలో బెల్టు షాపులు లేవని ఆబ్కారీ శాఖ ఉన్నతా ధికారులు చెపుతున్నారు. తరుచూ ఉన్నతస్థాయి సమావే శాల్లో సైతం ముఖ్యమంత్రి, మంత్రులకు అధికారులు ఇదే ప్రస్తావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలను మద్యం వ్యాపా రులు పంచుకొని ప్రత్యేకంగా బాటిళ్లపై కోడ్‌ బాషతో కూడిన ముద్రలు వేస్తున్నారు. ఆలయ ప్రాంగణాలకు సమీపంలో సైతం పూజా సామాగ్రి అమ్మకాలు చేసే షాపుల పక్కనే బల్లలపై పెట్టి మద్యం అమ్ముతున్నారు. పల్నాడు జిల్లాల్లోని పలు ఆలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పైగా ఆయా ప్రాంతాల్లో అమ్మే మద్యం బాటిళ్లపై నేరుగా సంబంధిత ఆలయం రబ్బరు స్టాంపు(సీలు) వేసి విక్రయించడం గమ నార్హం. షాపుల ఎదుట బల్లలు ఏర్పాటు చేసుకొని మద్యం సీసాలు అమ్ముతున్నారు. అక్కడ అనుమతి తీసుకున్న వ్యక్తులు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది. పైగా అక్కడి ఆలయం ముద్ర వేస్తుండటంతో ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందనే అభిప్రాయం భక్తుల్లో నెలకొంటోంది. ఇక రెస్టారెంట్లు, కిళ్లిd బంకుల్లో పరిస్థితి సరేసరి. ఇటీవల ప్రకాశం జిల్లా దర్శి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక సీళ్లతో కూడిన మద్యం బాటిళ్లు దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ముద్రలకు బదులు వీటిని వేయడమేంటని పలువురు మందుబాబులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement