Thursday, September 12, 2024

New Proposal Ready – నీట్‌కు.. మంగ‌ళమేనా…..


దేశ వ్యాప్తంగా ఒకే ప‌రీక్షా విధానం
ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఇక‌పై ఉండ‌క‌పోవ‌చ్చు
లీకుల‌తో ల‌క్ష‌లాది మంది విద్యార్ధుల్లో టెన్ష‌న్
మార్కులతో సీటు ఇచ్చేందుకు ప్ర‌తిపాద‌న‌లు
9, 10, 11 తరగతుల మార్కులూ కలిపే విధానం
కేంద్ర విద్యాశాఖకు ఎన్‌సీఈఆర్‌టీ ప్ర‌తిపాద‌న
అన్ని బోర్డుల్లోనూ ఒకే తరహా మార్కుల వ్యవస్థ
ఎంట్ర‌న్స్ ఎగ్జామ్​ల నుంచి విముక్తి
ఇప్పటికే ఓకే చెప్పిన ప‌లు రాష్ట్రాలు
ఫ‌ర‌ఖ్ బృందం అధ్య‌య‌నం ఏంటంటే..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైదరాబాద్​: వైద్య విద్యా కోర్సుల్లో ప్ర‌వేశం కోసం నిర్వ‌హిస్తున్న నీట్ ప‌రీక్ష‌కు మంగ‌ళం పాడ‌తారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.. దేశ వ్యాప్తంగా ఒకే సారి ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తుండంతో పేప‌ర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్‌లు జ‌రుగుతున్నాయి.. ఈ వివాదంతో ఈ ఏడాది ఇప్ప‌టి దాకా నీట్ కౌన్సెలింగ్ ప్రారంభ‌మే కాలేదు. ఈ లీకేజీల‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీం కోర్టు సైతం విద్యార్ధులకు న‌ష్టం క‌లుగ‌కుండా ఉండే విధానంపై దృష్టి పెట్టాల‌ని సూచించింది.. దీంతో దేశంలోని ఏ బోర్డు పరిధిలోనైనా ఒకే తరహా మార్కుల వ్యవస్థ ఉండాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన పరఖ్‌ (పర్ఫార్మెన్స్‌ అసెస్‌మెంట్‌, రివ్యూ అండ్‌ అనాలసిస్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ ఫర్‌ హోలిస్టిక్‌ డెవెలప్‌మెంట్‌) అన్ని కేంద్ర, రాష్ర్టాల విద్యా బోర్డులను అధ్యయనం చేసి కేంద్ర విద్యా శాఖకు పలు ప్రతిపాదనలు చేసింది.

ప్ర‌తిభ ఆధారంగానే ఉండాల‌ని..

- Advertisement -

పరీక్షలు, మార్కుల విధానాన్ని అన్ని బోర్డుల పరిధిలో ఒకే తరహాలో మార్చాలని సూచించింది. 12వ తరగతి ఫలితాల్లో 9, 10, 11వ తరగతి ఫలితాలనూ చేర్చడం ద్వారా విద్యార్థుల ప్రతిభను సరిగ్గా ముల్యాంకనం చేయవచ్చని పేర్కొన్నది. ఇందుకుగానూ 12వ తరగతిలో 9వ తరగతి మార్కులపై 15శాతం, 10వ తరగతిపై 20 శాతం. 11వ తరగతిపై 25 శాతం వెయిటేజీ ఇవ్వాలని, మిగతా 40 శాతాన్ని 12తరగతి మార్కుల వెయిటేజీ ఉండాలని ప్రతిపాదించింది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే ఇక నీట్‌, సీయూఈటీ వంటి పరీక్షల అవసరం ఉండకపోవచ్చని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు.

ఏ బోర్డు అయినా ఒకే వ్యవస్థ

ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న విద్యా బోర్డులతో పాటు జాతీయ స్థాయిలో ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, ఎన్‌ఐఓఎస్‌ వంటి బోర్డులున్నాయి. పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల తయారీ, మార్కుల కేటాయింపు వంటివి ఒక్కో బోర్డులో ఒక్కో రకంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ బోర్డులకు చెందిన దాదాపు 18వేల ప్రశ్నాపత్నాలను పరఖ్‌ బృందం అధ్యయనం చేసింది. అన్ని బోర్డుల పరిధిలో ఒకే రకమైన విధానాన్ని తీసుకురావాలని, తద్వారా విద్యార్థులు ఒక బోర్డు పరిధి నుంచి ఇంకో బోర్డు పరిధిలోకి మారడం సులువు అవుతుందని ప్రతిపాదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement