Saturday, November 2, 2024

New Books – ఎపి రాజ‌ముద్ర‌తో ప‌ట్టాదారు పాస్ బుక్స్ .. చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో నేడు జ‌రిగిన రెవెన్యూ సమీక్షలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రజల పాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం రూ.15 కోట్లు తగలేశారంటూ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇద్దామన్నారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేయ‌నుంది

మరోవైపు.. రీ సర్వే పేరుతో పొలాల సర్వేకి గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా.. సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చేందుకు రూ.650 కోట్లు ఖర్చయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. కేంద్రం చెప్పిన రీ సర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పకున్నా.. తన బొమ్మల కోసం గ్రానైట్ రాళ్లు సిద్దం చేశారని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలి అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంద‌న్నారు. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని తాత్కాలిక అంచనా వేసింది. జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ.700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృధా అయిందని చంద్రబాబు తెలిపారు. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు.. వాటితో ఏం చెయ్యవచ్చో చూడమని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement