Friday, November 22, 2024

ఏపీ ప్రయాణికులకు గమనిక: పట్టాలెక్కనున్న కొత్త రైలు సర్వీస్!

ఆంధ్రప్రదేశ్ ప్రయాణించే రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. నరసాపురం – విజయవాడ మధ్య ప్రతిరోజూ నడిచేలా కొత్త రైలు సర్వీస్‌ను ప్రవేశపెట్టారు. ఈ నెల 17 నుంచి ఈ ప్యాసింజర్‌ రైలు నడుస్తుంది. 07877 నంబరు గల ఈ రైలు ప్రతిరోజూ విజయవాడ నుంచి ఉదయం 7.10కి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. మళ్లీ నరసాపురం నుంచి 07281 నంబర్‌తో మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. 

ఇక ప్రతిరోజూ నరసాపురం -విజయవాడ మధ్య నడిచే ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైలును ఇటీవల రైల్వేశాఖ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చేసింది. దీంతో మధ్యాహ్నం పూట నరసాపురం నుంచి విజయవాడకు ఎలాంటి సర్వీసులూ ప్రస్తుతం నడవడం లేదు. దీంతో ప్రయాణికులు బస్సులను ఆశ్రయిస్తున్నారు.  ఈ నేపథ్యంలో కొత్త సర్వీసు ప్రారంభంకానుడడంతో ప్రయాణికులకు ఊరట లభించింది.

ఇది కూడా చదవండి: తెలంగాణ రాష్ట్రాన్ని బలవంతంగా లాక్కున్నారు: కేసీఆర్ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement