Saturday, September 21, 2024

New Names – జగన్ పథకాల పేర్లకు ఇక మంగళం

ఆంధ్రప్రభ స్మార్ట్ – ఆమరావతి: వైసిపి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిందని మంత్రి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఇందులో భాగంగా.. గత సీఎం జగన్‌ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి చెప్పినట్లు తెలిపారు.

”పథకాలకు భరతమాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టాలని నిర్ణయించాం. అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో నూతన పథకాల పేర్లు ప్రకటిస్తున్నాం. జగనన్న అమ్మఒడి పథకం పేరు ‘ తల్లికి వందనం’, జగనన్న విద్యాకానుక పేరు ‘ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’గా జగనన్న గోరు ముద్ద పేరు ‘ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా, మన బడి నాడు-నేడు పేరును ‘ మనబడి- మన భవిష్యత్తు’గా, స్వేచ్ఛ పథకం పేరును ‘బాలికా రక్ష’గా జగనన్న ఆణిముత్యాలు పేరును ‘అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చినట్లు ఎక్స్‌ వేదిగా వెల్లడించారు.

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement