Friday, November 22, 2024

New Law Bills – నేర సంబంధిత చ‌ట్టాలు మంచికైతే మార్చొచ్చు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : నేర సంబంధిత చట్టాల్లో మార్పులు, చేర్పులపై రాజ్యాంగ, న్యాయ నిపుణుల నుంచి భిన్నా భిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచికైతే మార్చొచ్చు.. కానీ ఆ మార్పుు విపరీత పరిణామాలకు దారితీసే విధంగా ఉండకూడ దని వారు సూచిస్తున్నారు. బ్రిటీష్‌ కాలంనాటి వ్యవస్థే నేటికీ శిరోధార్యం కావడం దురదృష్టకరమని మరికొందరు వాదిస్తున్నా రు. మన రాజ్యాంగ, న్యాయ వ్యవస్థను స్థూలంగా పరిశీలిస్తే, బ్రిటీష్‌ కాలంనాటి చట్టాల్లో మనకు ఉపయోగపడుతున్నవే అనేకంగా ఉన్నాయి. నేర చట్టాల మార్పుపై నిపుణుల మనోగతం కూడా అదే చెబుతోంది. తాజా మార్పుల నేపథ్యంలో మరిన్ని మార్పులు అవశ్యమన్న అభిప్రాయాలను కీలక స్థానాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు చెబుతు న్నారు. ఇప్పటికే 110 పర్యాయాలకు పైగా రాజ్యాంగ సమరణలు జరిపిన ప్రభుత్వాలు.. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్టును ఎందుకు మార్చలేదన్న ప్రశ్న తాజా పరిణామాల నేపథ్యంలో తెరపైకి వచ్చింది. అయితే ఈ చట్టం మార్పునకు నో చాన్స్‌ అని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

దేశంలో నేర సంబంధిత న్యాయవ్యవస్థలో బ్రిటిష్‌ కాలం నాటి ఐపీసీ, సీఆర్‌పిసీ, ఎవిడెన్స్‌ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయడం కాకుండామరింత ఉపయోగకరంగా, పటిష్టంగా, కఠినంగా చేయాల్సిన అవసరాన్ని నేటి సమాజం కోరు కుంటోందని కొంతమంది ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాజద్రోహ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడంతోపాటు- మూక దాడులకు పాల్పడితే మరణశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని రూపొందించడం ఆహ్వానించ దగినదే అయినప్పటికీ, నిందితులు తప్పించుకునేం దుకు దోహ దపడుతున్న లోటుపాట్లను, లొసుగులను తొలగించలేదన్న విముఖత కూడా వ్యక్తమవుతోంది. వీటితోపాటు- సాయుధ తిరుగు బాటు-, విధ్వంస చర్యలు, వేర్పాటు-వాద కార్యకలాపాలు, దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే నేరాలకు సంబంధించి కొత్త చట్టాల్లో ప్రతిపాదనలు ఆశాజనకంగా లేవన్నది నిపుణుల వాదన.

కొత్తగా ప్రవేశ పెట్టిన బిల్లులో దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం కీలక ప్రతిపాదన. దీంతోపాటు- మూక దా డులు, మైనర్ల పై అత్యాచారానికి పాల్పడితే గరిష్ఠంగా మరణశిక్ష విధించే ప్రతి పాదనలు ఇందులో పొందుపరిచారు. చిన్న నేరాలకు పాల్పడే వారికి సమాజ సేవ వంటి శిక్షను తొలిసారి అమలు చేసే ప్రతిపాదన ఉంది. వీటి తోపాటు- సాయుధ తిరుగుబాటు-, విధ్వంస చర్యలు, వేర్పాటు-వాద కార్యకలాపాలు, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే చర్యలను నేరాలుగా పరిగణిస్తూ ఈ బిల్లుల్లో పొందు పరిచిన నేపథ్యాన్ని, తదనంతర పరిణామాలను నిపుణులు విశ్లేషి స్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అమ ల్లో ఉన్న ఐపీసీ, సీఆర్‌పిసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌లు బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలు ఎప్పటికీ శిరోధార్యమేనని రాజ్యాంగ నిపుణులు స్పష్టమై న అభి ప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఆంగ్లేయుల పాలనను రక్షించ డం, బలోపేతం చేయడం తోపాటు- శిక్షించడమే లక్షంగా వాటిని ప్రవేశ పెట్టారన్న విమర్శలు కూడా రాజకీయంగా వెల్లువెత్తుతు న్నాయి. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదు.. వాటి స్థానంలో ప్రవేశ పెట్టనున్న కొత్త మూడు చట్టాలు, భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడి స్తున్నాయి. ఇక శాంతికి భంగం కలిగించే నేరాలు, సాయుధ తిరుగుబాట్లు, విధ్వంసకర చర్యలు, విభజనవాద కార్యకలాపాలు లేదా భారత ఐక్యత, సమగ్రతకు సంబంధించిన చట్టాలను సవరించిన చట్టాల్లో చేర్చడం మశుభ పరినామమని పలువురు కేంద్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. మరోవైపు మహిళలు, పిల్లలు, హత్యలు, ప్రభుత్వ వ్యతిరేక నేరాలను కొత్త బిల్లుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

తొలిసారిగా చిన్న నేరాలకు సంఘసేవా శిక్షలు
ఇక తొలిసారిగా చిన్నచిన్న నేరాలకు సంఘ సేవను శిక్ష విధించ బోతున్నారు. అంతేకాదు లింగసమానత్వంతో కొత్త చట్టాలను రూపొందించారు. ఇక వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద కార్యక లాపాలు, ఉగ్రవాదానికి సంబంధించిన కొత్త కార్యకలాపాలను నియంత్రించేలా కఠినమైన శిక్షలను చేర్చారు. వేర్వేరు నేరాలకు సంబంధించిన జరిమానాలు, శిక్షలను పెంచారు. ఇదిలా ఉండగా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ను 1860లో బ్రిటిష్‌ పాలకులు ప్రవేశ పెట్టారు. మూడు బిల్లుల్లోని ముఖ్యమైన మార్పుల్లో.. మైనర్లను అత్యాచారం చేస్తే ఉరిశిక్ష, సామూహిక అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల జైలు, మూక దాడులకు ఏడేళ్ల జైలుతో పాటు ఏడేళ్ళకు పైగా శిక్ష.. లాంటివి భారత శిక్షాస్మృతితో అత్యంత ముఖ్యమైన, కీలకమైన నిర్ణయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

వీకే అగ్నిహోత్రి నివేదిక ఏమైంది : డాక్టర్‌ మోహన్‌ కందా
ఎప్పుడో చేయాల్సిన చట్ట సవరణ పనులను ఇప్పుడు కేంద్రం మొద లు పెట్టడం ఒకింత శుభ పరిణా మమేనని, అయితే.. ఈ చట్టా ల్లో లొసుగులను తొలగించేం దుకు రాజ్యాంగ నిపుణులతో అధ్యయనం అవసరమని పదవీ విరమణ పొందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి డాక్టర్‌ మోహ న్‌ కందా అభిప్రాయపడ్డారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలోని డీవోపీటీకి చెందిన ఓ ఉన్నతాధికారి డాక్టర్‌ వీకే అగ్నిహోత్రి ఈ అంశంపై లోతైన అధ్యయనం చేశారని, అనంత రం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే.. అప్పట్లో ఆయనపైనే వేటు పడిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. చట్టాల్లో మార్పు చేస్తే మంచిని ఉంచి, చెడును తొలగించాలని మోహన్‌ కందా అభిప్రా యపడ్డారు. ఇప్ప టికే 110 సార్లు రాజ్యాంగ సవరణలు చేసిన ప్రభుత్వాలు ఇండియ న్‌ ఎవిడెన్స్‌ యాక్టును ఎందుకు మార్చలే క పోయిందని ఆయన ప్రశ్నించారు. బ్రిటీష్‌ కాలంనాటి చట్టాల్లో ఇప్పటికీ కొన్ని చట్టాలను మార్పు చేసే అవకాశం మనకు లేదన్నారు. అంటే.. ఆ కాలంలోనే అనేకమంది మేధావులు లోతైన అధ్యయనం చేసి, భావి తరాలను దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాలను రూపొందించారని గుర్తు చేశారు. బ్రిటీష్‌ హయాంలో దేశ ప్రజల కు ఎంతటి అన్యాయం జరిగిం దో.. అంతే స్థాయిలో వ్యవస్థలకు న్యాయం జరిగిందని ఒక ప్రశ్నకు సమాధానంగా తనదైన శైలిలో జవాబిచ్చారు. ఇప్పటికీ మనకున్న జ్యుడీషియరీ వ్యవస్థ ఆనాటిదే కావడం నిదర్శనంగా పేర్కొన్నారు.

2003లోనే మల్లిమత్‌ కమిటీ సిఫారసు – జేడీ లక్ష్మీనారాయణ
కొన్ని చట్టాల మార్పులను దేశ ప్రజలు ఎప్పటినుంచో కోరుకుం టున్నారని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, మహారాష్ట్ర మాజీ డీజీపీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపా రు. అప్పటి పరిస్థితులకు అనుగు ణంగా రూపొందించిన చట్టాలను మారుతున్న కాలక్రమంలో అప్‌గ్రేడ్‌ చేయాల్సి న అవసరం ఉందన్నారు. ఐపీసీ, సీఆర్‌పిసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌లతో పాటు కొన్ని కీలక చట్టాల మార్పు, సవరణ, తొలగింపు అంశాలపై 2003లోనే మల్లిమత్‌ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందనీ, రాజకీయ కోణంలో ఆ నివేదికలు అమలు చేయకపోగా, అందులోని అంశాలను నేటికీ బహిర్గతం చేయలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదివరకు రాజ్యాంగంలోని 124 (ఎ) రాజద్రోహం అధికరణను తొలగించగా, ఇప్పుడు 511 ఐపీసీ ని సమరించారని, అయితే ఆ చట్టాలను మరింతగా కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయ పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement