విశాఖపట్నం : ప్రస్తుతం డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు విశాఖపట్నంలో నేషనల్ డిప్ టెక్ కాంక్లేవ్ ప్రారంభమైంది. ఈ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పారిశ్రామిక రంగాల్లో అత్యాధునిక మార్పుపై ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను సీఎం సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, డోలా వీరాంజనేయులు, కొల్లు రవీంద్ర, హోంమంత్రి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ ఎన్టీఆర్ భవన్ ప్రజలను కలిశారు. వినతులను స్వీకరించారు. సమస్యలను పరిస్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.