అమరావతి, ఆంధ్రప్రభ : విశాఖ వేదికగా ఈనెల 3, 4 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా చేసుకున్న ఒప్పందాలు ఒక్కొక్క టిగా కార్యరూపంలోకి వస్తున్నాయి. ప్రతి వారం సీఎస్ అధ్యక్షతన ఎంవోయూలు చేసుకున్న పెట్టుబడిదారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ సమీక్షల సంద ర్భంగా పెట్టుబడిదారులు వ్యక్తంచేసిన సందేహాలను నివృతి ్తచేస్తున్నారు. ఈక్రమంలోనే గ్లోబల్ సమ్మిట్‌కు గుర్తుగా, సమ్మిట్ ముగిసిన మరుసటి రోజు సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండలం గుడిపల్లి సమీపంలోని కియా మోటార్స్ అనుబంధ యూనిట్‌కు భూమిపూజ జరిగింది. ఇది సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాల కార్యరూపానికి నాందీ పలికింది. దీని తరువాత హైదరాబాద్‌కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు అనంతపురం, కర్నూలు ప్రాంతాలను ఎంపిచేసుకుని వారి వారి పరిశ్రమలను నెలకొల్పేందుకు వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పుట్టపర్తి మండలం కప్పలబండ సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు- చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ ముందుకు వచ్చింది. కంపెనీ ప్రతినిధులు ఇటీ-వల ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అతి త్వరలోనే దీనికి శంకుస్థాపన జరగనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్న పరిశ్రమ తరహాలో జీనోమ్ వ్యాలీ ప్రాజెక్టును ఏర్పాటు- చేసేందుకు ఏపీఐఐసీ తెలంగాణ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపింది. ఈప్రత్యేక ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని కూడా సిద్ధంగా ఉంచారు. ఈతరహాలోనే మరిన్ని కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వారు చెబుతున్నారు. ఈమేరకు వారు ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతునట్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగానే అతిపెద్ద పెట్టుబడులు కూడా గ్రౌండ్ అయ్యేందుకు కార్యాచరణ సిద్ధమౌతోంది.
గ్రీన్ ఎనర్జీ రంగంలో
రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు పెట్టు-బడిదారులకు ప్రభుత్వం అదనపు ప్రోత్సాహాన్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. దీని ద్వారా కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో చదువుకున్న యువతకు ఉపాధి కల్పనతో పాటు-, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టుల ప్రతిపాదనల ద్వారా ఆప్రాంత రైతులకు కూడా కొన్ని ప్రయోజనాలు దక్కుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కరువు పీడిత ప్రాంతంగా పేరుపొందిన అనంతపురం జిల్లాలో లక్ష ఎకరాల భూముల్లో ఇంధన ప్రాజెక్టులు ప్రారంభించేందుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈభూముల్లో సోలార్, విండ్ ప్రాజెక్టుల ద్వారా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు లను ఏర్పాటు- చేసేం దుకు పెట్టు-బడిదారులు సిద్ధం గా ఉన్నట్లు- సమాచారం. రైతులు, లేదా భూ యజమానులు సంవత్సరానికి సగటు-న రూ. 40 వేల వరకూ స్థిరమైన ఆదాయాన్ని లీజుగా పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అంతే కాకుండా రైతులు లీజుకిచ్చిన తరువాత కూడా ఖాళీ స్థలంలో పంటలు పండించుకునే వెసులుబాటు కల్పించాలని భావిస్తోంది. ఆమేరకు పెట్టుబడి దారులకు కూడా స్పష్టమైన విధానాన్ని చెప్పేందుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యా చరణ ప్రారంభించి వారిని సూత్రప్రాయంగా అంగీకరింపజేసినట్లు తెలుస్తోంది.
సీమ ప్రాంతంలో పెట్టుబడులకు అనుకూలం
రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురం, కర్నూలు మరియు కడపలో కొంత భాగం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు అత్యంత అనువైనవిగా ఉన్నట్లు గుర్తించారు. గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన పెట్టు-బడిదారులు ఈ ప్రాంతంలో సోలార్ ప్లాంట్లను నెలకొల్పడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ యూనిట్లు- ఉపాధిని అందించడమే కాకుండా, కరువు పీడిత రైతులకు లీజు మొత్తం రూపంలో ప్రతి సంవత్సరం స్థిరమైన ఆదాయాన్ని పొందనున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ కొనసాగుతుండగా, ఆ తర్వాత సత్యసాయి జిల్లాలోని ఓడీ చెరువులో మరో ప్రాజెక్టు కొనసాగుతోంది.
భూముల ధరలకు రెక్కలు
పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం, కొత్త పెట్టు-బడిదారులు ప్రైవేట్ భూముల కోసం వెతుకుతుండటంతో రాయలసీమ జిల్లాల్లోని భూముల రేట్లు కూడా పెరుగుతున్నాయి. తమ ప్రాంతంలో భూముల ధరలు పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత భూముల ధరలు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే గ్లోల్ సమ్మిట్ తరువాత పరిశ్రమలు పెట్టేందుకు పెట్టుబడిదారులు వరుసగా పర్యటిస్తుండటంతో భూముల రేట్లు మరింతగా పెరుగుతున్నాయని ఆప్రాంత రైతులు చెబుతున్నారు.