Saturday, November 23, 2024

ఏపీలో నూతన విద్యా విధానం.. పాఠశాలల్లోకి అంగన్​వాడీల విలీనం

విజయవాడ, ప్రభన్యూస్ : నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాల విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా విద్యాశాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. మూడంచెల విద్యా విధానంతో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అందులో భాగంగా నూతన విద్యా విధానంలో 3, 4, 5 తరగతులను కూడా ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేయగా, ఆదే దిశలో అంగన్‌వాడీ చిన్నారులు ప్రాథమిక పాఠశాలలో కసరత్తు కూడా అధికారులు కొలిక్కి తీసుకువస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని కేంద్రాలను సమీప ప్రాథమిక పాఠశాలలకు మ్యాపింగ్‌ చేశారు. 250 మీటర్లలోపు పూర్వ ప్రాథమిక విద్య (అంగన్‌వాడీ కేంద్రాలు) పీపీ-1, పీపీ-2 మరియు 1, 2 తరగతులను విలీనం చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని కేంద్రాలను విడతల వారీగా చేసేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు సైతం టీచర్లుగా నామకరణం పొందనున్నారు. తొలి విడతలో విలీనమయ్యే కేంద్రాల్లో పనిచేస్తున్న వారందరూ ప్రీప్రైమరీ ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లతోపాటు పనిచేయబోతున్నారు. వీటిని వైఎఆ్సర్‌ ప్రీప్రైమరీ స్కూల్స్గా మార్పు చేయనున్నారు. అద్దె భవనాలలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. భవనాలకు చెల్లించే అద్దె., భారం కావడంతో తొలుత వాటిని పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయించారు. దీంతో వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గదులను అంగన్‌వాడీ కేంద్రాల విద్యార్థుల కోసం కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగానే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, గదులు, మరుగుదొడ్లు, వంటగదులు తదితర వసతులు ఉన్న 204 పాఠశాలల్లో 287 కేంద్రాలను కలపడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లోని 39 కేంద్రాలను 28 పాఠశాలల్లో విలీనం చేశారు. కొత్త విద్యావిధానంలో అంగన్‌ వాడీ చిన్నారులను ప్రీప్రైమరీ, 1, 2 తరగతులుగా విభజించి పాఠశాలల్లోనే బోధించాల్సి ఉంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు- జరుగుతున్నాయి. కొత్త విద్యావిధానంలో అంగన్‌ వాడీ చిన్నారులను ప్రీప్రైమరీ, 1, 2 తరగతులుగా విభజించి పాఠశాలల్లోనే బోధించాల్సి ఉంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement