న్యూ ఢిల్లీ – ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునేడు ఢిల్లీ లో భేటీ అయ్యారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది.
గత ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని చంద్రబాబు వివరించినట్టు సమాచారం. దాదాపు గంటకు పైగా ప్రధానితో చంద్రబాబు సమావేశం కొనసాగింది.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కే రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీ కృష్ణదేవరాయలు కూడా పాల్గొన్నారు.
అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ .అయిన చంద్ర బాబు ఎపి అభివృద్ధికి సహకరించ వలసింది గా కోరారు.
- Advertisement -