Sunday, November 3, 2024

New Busses – ఎపిఎస్ఆర్టీసీకి కొత్త కళ … త్వరలో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఆర్టీసీ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా వాహనాలను ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబుఆలోచన అని అన్నారు. ఆర్టీసీ నుంచి త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో ఆర్టీసీని వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శలు గుప్పించారు.

కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడాడని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే 200 వరకూ కొత్త బస్సులు రోడ్డెక్కాయన్నారు. వచ్చే మూడు నెలల్లో మరో 1200 కొత్త బస్సులు రోడెక్కేలా ఆర్డర్లు పెట్టామన్నారు. ఆర్టీసీ బస్సులకు చంద్రబాబు పెట్టిన అమరావతి బ్రాండ్ దెబ్బతీసేలా జగన్ డాల్ఫిన్ క్రూజ్ పేరుతో బస్సుల్ని ప్రోత్సహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఆర్టీసీ బస్సులకు చంద్రబాబు పెట్టిన అమరావతి బ్రాండ్ పీకటం జగన్ తరం కాదన్నారు. వ్యక్తిగత కక్షతో జగన్ నిర్వీర్యం చేసిన అమరావతి బ్రాండ్ బస్సులను తిరిగి పునరుద్దరిస్తామని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement