Wednesday, November 20, 2024

రేపటి నుంచి కొత్త విద్యా సంవత్సరం.. తెరుచుకోనున్న పాఠశాలలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మంగళవారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరాన్ని ఈ నెల నాలుగో తేదీనే ప్రారంభం కావాల్సి ఉన్నా.. ప్రధాని పర్యటన రాష్ట్రంలో ఉండటంతో ఐదో తేదీన ప్రారంభమవుతోంది. ఇప్పటికే అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేయడంతో ఆ మేరకు తరగతులు జరగనున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం తరగతులు నిర్వహించాలని నిర్ణయించడంతో ఆ మేరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరగకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురు కానున్నాయి.

పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు రేషనలైజేషన్‌ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌ జరగలేదు. కిలోమీటర్‌ పరిధిలోపు ఉన్న 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియ కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడ చేర్చాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్‌ఈపీపై సరైన కసరత్తు జరగకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement