Friday, November 22, 2024

ప‌వ‌ర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణ చేయొద్ద‌ని నాగాలమ్మ పుట్టకు పూజలు


ముత్తుకూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఏపీజెన్ కో బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ కాకుండా చూడాలని ప్రాజెక్టు ప్రాంతంలో ఆరాధ్య దైవం అయినటువంటి నాగదేవతకు నాగాలమ్మ పుట్ట వద్ద ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక నాయకులు సంయుక్తంగా అఖండ జ్యోతి వెలిగించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది కార్మికులు ఇంజనీర్లు ఉద్యోగస్తులు హాజరయ్యారు. భక్తిశ్రద్ధలతో ప్రతి ఒక్కరూ అఖండ జ్యోతి వెలిగించి ప్రాజెక్టు ప్రైవేటు పరం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి మనసు ప్రసాదించాలని నాగదేవత.ను వేడుకున్నారు. మహిళ కార్మికులు, ఇంజనీర్లు పూజలు చేసి నాగదేవత ఆశీస్సులు కోరారు. ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రభుత్వం ప్రకటన చేసేంత వరకు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుందని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల నాయకులు గుమ్మడి శ్రీనివాసులు, కృష్ణ చైతన్య, సుధాకర్, కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement