Tuesday, November 26, 2024

NLR : సీఎం జగన్ గెలుపు కోసం.. వాలంటీర్ల రాజీనామా…

ముత్తుకూరు, ఏప్రిల్ 1( ప్రభ న్యూస్) : జరగనున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం డమ్మాయిపాలెం గ్రామానికి చెందిన పది మంది వాలంటీర్లు వ్యక్తిగత కారణాలు చూపుతూ సోమవారం రాజీనామాలు చేయడం జరిగింది.

ఐదు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అవ్వ తాతలకు పింఛన్లు పంపిణీ చేసిన గ్రామ వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పెడుతూ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. తమ రాజీనామా లేఖలను గ్రామ సచివాలయం డిడిఓ రావుల వెంకటేశ్వర్లుకు సమర్పించారు. శాసనసభ ఎన్నికల్లో తాము ఇంటింటికి తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణిగోవర్ధన్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని గ్రామ వాలంటీర్లు మీడియాకు చెప్పడం జరిగింది. గ్రామ వాలంటీర్ల రాజీనామాలను ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని గ్రామ సచివాలయం ఉన్నతాధికారులు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement