Monday, November 18, 2024

గ్రామాల్లో ఫీవర్ సర్వే ముమ్మరం

జలదంకి – కరోనా మహమ్మారి ప్రజల పై విరుచుకు పడుతున్న వేళ ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు, వాలంటీర్లు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తమకు అప్పగించిన విధుల్లో భాగంగా గా బ్రాహ్మణక్రాక సచివాలయం 2 పరిధిలో తొమ్మిదో మైలు గ్రామంలో ఇంటింటికి తిరిగి గ్రామ ప్రజలు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా ఏ గ్రామంలో ఎంతమంది జ్వర పీడితులు ఉన్నారు వారి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయ్ అనే కోణంలో శనివారం సర్వే నిర్వహించారు ఇప్పటికే గ్రామాల్లో కరోనా కేసులు విస్తరించడంతో చాలా మంది పరీక్షలు చేయించేందుకు నిరాకరించడంతో జ్వరాల సర్వేతో వైరస్ విస్తరణను అరికట్టేందుకు వారు కృషి చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పటికే వైరస్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి వివరాలు కూడా తీసుకున్నారు ప్రజలకు కరోనా యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుంది ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని వారు వివరించారు ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే వైద్య సిబ్బందికి తెలపాలని ముఖ్యంగా కరోనా లక్షణాలు కనబడితే వైద్యశాలకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలని వారు తెలిపారు ఎంతో ముఖ్యమైన పని అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని వారు కోరారు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని వారు పేర్కొన్నారు తరచూ శానిటైజర్ పూసుకోవడం కానీ సబ్బుతో చేతులను కడుక్కోవటం గాని చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఏఎన్ఎం కామేశ్వరి, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement