ఆత్మకూరు రూరల్ – ఆత్మకూరు పట్టణంలో శనివారం నాడు మున్సిపాలిటీ తాగునీటి సరఫరా లో ఏర్పడిన లోపం కారణంగా నీరు ఎర్రగా రావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు వాటర్ ప్లాంట్ ను మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సర్దార్ పరిశీలించారు. ఆత్మకూరు పట్టణంలో ఉదయం పైపుల ద్వారా వచ్చిన మున్సిపల్ త్రాగునీరు అపరిశుభ్రంగా ఉండటంతో ఆ నీటి ని పట్టుకున్న స్థానికులు ఇబ్బంది పడ్డారు.. రంగు మారిన నీటిని చూసిన కొందరు స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ కు నీటిని చూపించి సమస్య తెలిపారు…. దీంతో వెంటనే స్పందించిన సర్దార్ పట్టణంలోని త్రాగునీటి ప్లాంట్ కు వెళ్లి అక్కడ పరిశీలించారు.. మున్సిపల్ ఏఈ ప్రసాద్ తో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని ఇలా రంగు మారిన నీటిని తాగడం వల్ల ప్రజల ఆరోగ్య సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు.. రాత్రి వాటర్ ట్యాంక్ లో ఏర్పడ్డ చిన్న లోపం కారణంగా నీరు ఈ విధంగా వచ్చాయని కమిషనర్ కి విషయం తెలిపామని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. వాటర్ ట్యాంక్ పరిశీలనలో వైస్ చైర్మన్ సర్దార్ తో పాటు స్థానిక 18వ వార్డ్ కౌన్సిలర్ వేణు మరియు స్థానిక వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement