వరికుంటపాడు : మండల కేంద్రమైన వరికుంటపాడు గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ సాయిబాబా ఆలయంలో మంగళవారం ప్రథమ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్తలు సుంకర వెంకటాద్రి సుజన దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి విగ్నేశ్వర పూజ పుణ్యాహ వచనము, సకల దేవత మండలమండపారాధన, పంచగన్య, ప్రసన్న, అర్చన, స్వామివారికి పంచామృత, సుగంధ ద్రవ్య అభిషేకము విశేషంగా అన్నాభిషేకం సకల దీపారాధన పుష్పార్చన పూర్ణాహుతి తీర్థప్రసాదాలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం, ఏడు గంటలకు స్వామి వారి పల్లకి సేవ, రొట్టెల పండగ అనంతరం స్వామివారికి పవళింప సేవ తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అలాగే రాత్రికి కాకినాడ వారిచే భజన కార్యక్రమం నిర్వహిస్తారన్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సుంకర వెంకటాద్రి సుజనా దంపతులు తెలిపారు. కనుక మండలంలోని యావన్మంది భక్తులు పాల్గొని స్వామి వారి కృప కటాక్షాలను పొందాలని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement