నెల్లూరు – తిరుపతి లోక్‌సభ స్థానానికి వైయస్ఆర్ సీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం. గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు.. నెల్లూరు జిల్లా కలెక్టర్. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందుగా ఆయన పార్టీ కార్యాలయంలోని వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, నగర కూడలిలో ఉన్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు గురుమూర్తి పూలమాల వేసి నివాళులర్పించారు.. అనంతరం వేలాది మంది పార్టీ శ్రేణులు వెంట రాగా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలతో కలిసి గురుమూర్తి నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈ రోజు తిరుపతి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తున్నానని చెప్పారు. ఎన్నికలో ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తన గెలుపునకు ఉపయోగపడుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, బాలి నేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, గౌతమ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో. ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిటి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూధనరెడ్డితో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.