నెల్లూరు నగరంలోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 24వ తేదీన జరిగిన ట్రాన్స్ జెండర్ బల్లికురవ శ్రీకాంత్ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు ఆరిపోయిన మస్తాన్ బాబు నల్లగండ్ల జీవా, మోనాలిసా తదితరులను అరెస్టు చేసినట్లు నెల్లూరు నగర డీఎస్పి హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరం వీఆర్సీ సమీపంలో ఉన్న చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో బుధవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ట్రాన్స్ జెండర్ బల్లికురవ శ్రీకాంత్ కు మాయమాటలు చెప్పి అతన్ని పూర్తి స్థాయిలో ట్రాన్సజెండర్ గా మార్చేందుకు ముగ్గురు నిందితులు ఆపరేషన్ చేసి మర్మాంగాలు తొలగించారని దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు. చిన్నబజార్ పోలీసులు ప్రత్యేక టీమ్ ఏర్పాటుచేసి నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారని వివరించారు. ఈ సమావేశానికి చిన్న బజార్ సీఐ మధు బాబు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital