ముత్తుకూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి 15 సూత్రాల పథకాన్ని వెంటనే అమలు జరిపేలా చర్యలు తీసుకోవాలని జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్పుర ను జాతీయ మైనార్టీ కమిషన్ సలహా సభ్యులు షేక్ అబ్దుల్ షఫీ ఉల్లా కోరారు. గురువారం ఢిల్లీలో జరిగిన వార్షిక సమావేశానికి ఆయన హాజరు కావడం జరిగింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జాన్ బర్లా ముఖ్య అతిథిగా విచ్చేసినారు. ఈ నేపథ్యంలో కమిషన్ దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి 15 సూత్రాల పథకాన్ని అమలు చేయాలని కోరారు. చైర్మన్ వెంటనే స్పందించి సమాధానం చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రూపంలో ఆదేశాలు ఇస్తామని కమిటీలను ఏర్పాటు చేసి ప్రధాన మంత్రి 15 సూత్రాల పథకాన్ని అమలు జరిగేలా చూస్తామన్నారు. జాతీయ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీలకు స్వయం ఉపాధి నిమిత్తం రుణాలు మంజూరు జరిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వైస్ చైర్మన్ కెర్సి కైకుష్రో దేవో, సభ్యులు కుమారి షహజాదీను మర్యాదపూర్వకంగా కలిసినట్లు సలహా సభ్యులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement