Wednesday, November 20, 2024

అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టలేరు

రాపూరు, -అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టలేరని టిడిపి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. బుధవారం రాపూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన జరుగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో అబద్ధాల కరపత్రాల తో ప్రచారం చేస్తున్న అధికార వైయస్ఆర్సిపి పార్టీని నమ్మి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముస్లింల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రంజాన్ తోఫా, దుఖాన్ మఖాన్, దుల్హన్, ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్య వంటి అనేక సంక్షేమ పథకాలు నేడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమలకు నోచుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్ టి, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి పోయాయి, రెండు వందల నుంచి రెండు వేల రూపాయలకు పెన్షన్లను పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. అధికారంలోకి వస్తే 3000 పెన్షన్ ఇస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచటం జరిగిందన్నారు. రైతులకు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఏ రాష్ట్రంలో కూడా జరగటం లేదన్నారు. అహర్నిశలు కష్టపడి ఇ పండించిన వరి ధాన్యాన్ని కూడా పరుగు రూపంలో, ప్రేమ రూపంలో రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. 45 సంవత్సరాలు దాటిన అక్కాచెల్లెళ్లకు పెన్షన్ ఇవ్వకపోగా ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ముస్లింల మైనార్టీల కోసం టిడిపి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసి ఈరోజు ఏం మొహం పెట్టుకుని రాపూర్ లో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఓట్లు అడగడానికి వచ్చారని ఆయన ప్రశ్నించారు. దురదృష్టవశాత్తు బల్లి. దుర్గాప్రసాద్ చనిపోటంతో తిరుపతి పార్లమెంట్ కు ఉపఎన్నికలు వచ్చాయని, వారి కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఈ సీట్లు కేటాయించి ఉంటే అసలు ఈ ఎన్నికలే వచ్చేయి కాదన్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పనబాక లక్ష్మి ని భారీ మెజార్టీతో గెలిపించడానికి తిరుపతి పార్లమెంటు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ముక్తార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement