ఫైలేరియా నిర్మూలన లో భాగంగా పైలేరియా పరీక్షలు నిర్వహించారు. కొడవలూరు మండలం రామన్నపాలెంలోని శివసాయి హైస్కూల్లో టిఏఎస్ ప్రోగ్రామ్ ( ట్రాన్స్మిషన్ అస్సెస్మెంట్ సర్వే) ద్వారా..1వ తరగతి, 2వ తరగతి చదువుతున్న 33మంది పిల్లలకు ఎఫ్ టి ఎస్ ద్వారా ర్యాపిడ్ ఫైలేరియా టెస్టులు చేశారు. ఇక్కడ అందరికీ ఫైలేరియా నెగెటివ్ వచ్చినది. జిల్లాలో ఈ విధంగా 172 పాఠశాలలు కంప్యూటర్ ద్వారా ర్యాండం పద్దతి ద్వారా ఎంపిక చేశామని తెలిపారు.ఒకొక్క స్కూల్లో 5మంది టీమ్ మెంబర్లు పాల్గొని ఈ కార్యక్రమం చేపడతామని టీమ్ లీడర్ డా.ఎం.రామకృష్ణ తెలిపారు.. ఈ కార్యక్రమంలో వైద్యులు రామకృష్ణ తోపాటు సబ్ యూనిట్ అధికారి సుధాకర్ రెడ్డి, లాబ్ టెక్నీషియన్ నాగరాజు, ఏయన్ యం అనిత, హెచ్ఏ సుధాకర్, స్థానిక స్కూల్ ప్రధానోపాధ్యాయులు మూలి దయాకర్ రెడ్డి, ఆరోగ్య కార్యకర్త వెంకట్రావు, ఏయన్ యం శ్రావణి, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement