Saturday, November 23, 2024

Breaking: పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్..

నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్‌ నుంచి రేపు ఉదయం 11.56గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ ఉదయం 10.56గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 1117కిలోల ఓషన్‌ శాట్‌-3- (ఈవోఎస్‌-06),ఇండియా భూటాన్‌ దేశాలు సంయుక్తంగా రూపొందించిన 18.28 కిలోల అకా ఐఎన్‌ఎ్‌స-2బీ, భారత్‌కు చెందిన ధ్రువ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ కంపెనీకి చెందిన 1.45 కిలోల బరువు గల రెండు తైబోల్ట్‌ ఉప్రగ్రహాలు, పిక్సిల్‌ ఇండియా కంపెనీకి చెందిన 16.51 కిలోల ఆనంద్‌, అమెరికాకు చెందిన 17.92 కిలోల బరువు గల ఆస్ర్టోకాస్ట్‌-2 పేరుతో నాలుగు ఉపగ్రహాలను ఈ రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.రాకెట్‌ నింగికెగసిన అనంతరం నాలుగు దశలను పూర్తిచేసుకొని చివరి దశలో ఉపగ్రహాలను కక్ష్యలోకి విడిచిపెడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement