Saturday, November 23, 2024

ప్లాస్టిక్ నివారణకు ప్రజల సహకారం తప్పనిసరి

బుచ్చిరెడ్డిపాలెం : నగర పంచాయతీలో ప్లాస్టిక్ నివారణకు ప్రజల సహకారం తప్పనిసరి అని కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్లాస్టిక్ పై దండయాత్రలో భాగంగా నగర పంచాయతీలోని దుకాణాలకు తిరిగి ప్లాస్టిక్ నివారణపై దుకాణాల యజమానులకు అవగాహన కల్పించారు. ప్రతి దుకాణానికి వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. వారం పాటు దుకాణాల యజమానులకు అవగాహన కల్పించడం జరుగుతుందని కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం వంద రూపాయలు నుండి 15 వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ నివారణకు ప్రజల్లో సైతం చైతన్య రావాలన్నారు. ప్లాస్టిక్ వాడడం వాటి అనర్ధాలు పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. నిర్దేశిత నిబంధనలకు తక్కువ నాణ్యతతో కవర్లు డిస్పోజలు క్లాసులు వాడడం ద్వారా క్యాన్సర్ తదితర వ్యాధులు సోకే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి పెను ప్రమాదం ఉందన్నారు. వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలవడానికి వేల సంవత్సరాలు పడుతుందన్నారు. స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చి ప్లాస్టిక్ నివారణలో చేతులు కలపాలన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి స్వచ్ఛ రెడ్డిపాలెం తీసుకువచ్చి రాష్ట్రంలోనే బుచ్చి నగర పంచాయతీని ఉన్నత శ్రేణిలో నిలపాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement