Wednesday, November 20, 2024

బ‌య్యం అక్ర‌మ ర‌వాణాలో వెనుకున్న‌ది ఎవ‌రు…

నెల్లూరు జిల్లాలో ఇటీవల అక్రమంగా తరలిస్తూ భారీగా పట్టుబడ్డ రేషన్‌ బియ్యం ఘటన పౌర సరఫరాల సంస్థలో ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ ఘట న వెనుక భారీ తిమింగలాలు ఉన్నట్లు సమాచారం. బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్‌ అధికారుల దర్యాప్తులో అనేక విషయాలు వెల్లడైనట్లు సమాచారం. బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ నిల్వ చేసిన బాలాజీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ యజమానిపై ఇప్పటికే కేసు నమోదు చేయగా.. నిబంధనల ప్రకారం సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రేషన్‌ బియ్యం గతంలో అక్రమంగా నల్లబజారుకు భారీ ఎత్తున తరులుతున్న నేపథ్యంలో మాఫియాకు కళ్లెం వేసేం దుకు ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం మొబైల్‌ వాహనాల ద్వారా ఇంటింటికి బియ్యం పంపిణీ చేస్తున్నారు. నూతన విధానం అమలైన తర్వాత రేషన్‌ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడిందని ప్రభుత్వం భావించింది. అయితే గత వారం నెల్లూరులో అక్రమంగా తరలిస్తున్న బియ్యంతో పాటు నిల్వ చేసిన 835 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నూతన ప్రక్రియ మొదలైన తర్వాత ఇంత భారీ ఎత్తున బియ్యం పట్టుబడటం ఇదే మొదటి సారి కావడం విశేషం. దీంతో ఈ ఘటనపై ఒకవైపు విజిలెన్స్‌ అధికారులు, మరోవైపు పౌర సరఫరాల సంస్థ అధికారులు లోతైన విచారణ చేపట్టారు. ఈ బియ్యం ఎక్కడనుంచి వచ్చింది అన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో బాలాజీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ భారీ ఎత్తున గోదాములు నిర్మించి సెం ట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అద్దెకు ఇవ్వడంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ సంస్థ మూడు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను నిర్వహి స్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ నెల్లూరు జిల్లా ఇనమ డుగు లో నిర్మించిన గోదాములను సీడబ్ల్యూసీకి గత ఏడాది అద్దెకు ఇచ్చారు. సీడబ్ల్యూసీ పౌర సరఫరాల సంస్థకు ఈ గోదా ములను అద్దెకు ఇచ్చింది. గత సంవత్సరం నెల్లూరు జిల్లాలో ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి కావడంతో బియ్యం నిల్వలు చేసేందుకు పౌర సరఫరాల సంస్థ సీడబ్ల్యూసీ నుంచి గోదాములు అద్దెకు తీసుకుని పది వేల టన్నులకు పైగా బియ్యా న్ని నిల్వ చేసింది. అయితే అందులో బియ్యం నిల్వలు క్రమంగా తగ్గిపోయి గోదాములు ఖాళీ అయ్యాయి. ఈ తరుణంలో గోదాములో బియ్యం నిల్వలు పూర్తిగా అయి పోయి ఖాళీగా ఉన్నట్లు గోదాముల నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న బాలాజీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ సీడబ్ల్యూసీకి లిఖిత పూర్వకంగా తెలియజేయగా.. ఇదే విషయాన్ని సీడబ్ల్యూసీ పౌర సరఫరాల సంస్థకు సమాచారం అందిం చినట్లు తెలుస్తోం ది. ఇదిలా ఉండగా.. మార్చి 30వ తేదీన పౌర సరఫరాల సంస్థ ఖాళీ చేసిన బాలాజీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాముల నుంచి ఏపీ16 8991 గల లారీలో అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అం దింది. దీంతో విజిలెన్స్‌ అధికారులు లారీని వెంబడించి పట్టు కోగా అందులో 480 బస్తాల రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తిం చారు. అనంతరం ఈ విషయాన్ని విజిలెన్స్‌ అధికా రులు, పౌర సరఫరాల సంస్థల అధికారులకు తెలియజేశారు. తరు వాత ఇనుమడుగులోని బాలాజీ వేర్‌ హౌసింగ్‌ గొఓదాములో తని ఖీలు చేయగా.. అక్కడ అక్రమంగా నిల్వ చేసిన మరో 390 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 870 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నెల్లూరులోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు. అలాగే గోదాములో 464 ఖాళీ గోతాలను కూడా స్వాధీనం చేసుకొ వడం జరిగింది. అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వ చేసిన బాలా జీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాము యజమానిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని బయటకు రాని వ్వకుండా అధికారులు గోప్యత పాటించడంతో ఆంతర్యం ఏమి టన్నది అర్థం కావడం లేదు. నిబంధనల ప్రకారం ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సదరు సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడం జరుగుతుంది. బాలాజీ వేర్‌ హౌసింగ్‌ పర్యవేక్షణలో పౌర సరఫరాల సంస్థకు సం బంధించిన పలు గోదాములు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇటీవల సుమారు 600 కోట్ల విలువ గల పౌర సరఫరాల సంస్థకు చెందిన గోతాలు పశ్చిమ బెంగాల్‌ నుంచి ఏపీకి రవాణా చేసే గోతాల రవాణా టెండర్‌ను ఈ సంస్థ దక్కిం చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలించడంతో పాటు గోదాములో నిల్వ చేసిన బియ్యం పట్టుబడటంతో నిబంధనల ప్రకారం సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు రాజకీయ నేతల ఒత్తిళ్ల కారణంగా ఈ సంస్థపై చర్యలు తీసుకోవడంలో అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
డీఎం వివరణ..
రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నెల్లూరు జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ పద్మాను వివరణ కోరగా.. మొత్తం 870 బస్తాల రేషన్‌ బియ్యాన్ని 464 ఖాళీ గోతాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా రేషన్‌ బియ్యం నిల్వ చేసిన బాలాజీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement