Tuesday, November 26, 2024

రాట్నంపై నూలు వ‌డికి..ఓట్ల‌ను అభ్య‌ర్ధించిన ప‌న‌బాక‌..

గూడూరు రూరల్: వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేదవాడి నడ్డి విరుస్తోందని తిరుపతి పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి ని పనబాక లక్ష్మి వెల్లడించారు.శనివారం తిరుపతి పార్లమెంట్ టిడిపి ఎంపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి,మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు.చేనేత కార్మికుడు నివాసము కి వెళ్లి రాట్నం ని తిప్పారు. చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో వీధులన్నీ కిటకిటలాడాయి.ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇస్తూ దానికి రెట్టింపుగా నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల వద్దనుండి తీసుకుంటున్నారని ఈ పెరుగుదల వల్ల పేదవాడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నియోజకవర్గ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్న నన్ను గెలిపిస్తే రాష్ట్ర సమస్యల పై పార్లమెంటులో పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అత్యధికంగా వైఎస్ఆర్సిపి ఎంపీలను ప్రజలు గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా పై ఒక్కసారి కూడా పార్లమెంటులో ఎంపీలు మాట్లాడకపోవడం శోచనీయమని మరోవైపు రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయింది అని ఇసుక లిక్కర్ మాఫియా దందాలు ఎక్కువైపోయాయి అని తెలిపారు.అవినీతిమయమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17వ తేదీ జరిగే తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో చెన్నూరు గ్రామం లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని పనిచేసే లక్ష్మి పనబాక లక్ష్మి ని ఎంపీ గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు తిరుపతి పార్లమెంట్ మహిళ ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా,భాస్కర్ రెడ్డి ,వెంకటేశ్వర రాజు ,భారతి,కల్లూరు రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement