Friday, November 22, 2024

ఆనం పార్టీ నుంచి త‌ప్పుకో..నేదురుమ‌ల్లి రామ్ కుమార్

రావూరు – వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయ‌ణ రెడ్డిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దూరం పెట్టినా ఇంకా పార్టీని ప‌ట్టుకుని వేలాడు తున్నార‌ని, తొంద‌ర‌గా ప‌క్క‌కు త‌ప్పుకుంటే ప్ర‌జ‌లు, అధికారులు ఆమోమ‌యం నుంచి బ‌య‌ట‌ప‌డతార‌ని వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జీ నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.. రావూరు లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఆనంపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ లో జగన్మోహన్ రెడ్డి తల్లి ని, ఆయ‌న‌ను దూషించిన వ్యక్తికి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే ని చేసిన స హృదయుడు జగన్మోహన్ , అని అటువంటి జ‌గ‌న్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలోనే ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సబబని ప్ర‌శ్నించారు.. ఆనం పార్టీ వీడ‌టం వ‌ల్ల పార్టీకి మరింత లాభ‌మ‌ని అన్నారు.కాగా, సమయభావం వల్ల మౌలిక వసతులు లేనందున్న గ్రీక్స్ పోటీలను రాపూరు నుంచి నెల్లూరు కు మార్చడం జరిగింద‌న్నారు. తన సొంత ఖర్చులతో వాహనాలు ఏర్పాటు చేసి క్రీడాకారులను నెల్లూరు కి తరలిస్తామ‌న్నారు. ఆటల పోటీలు నిర్వహించాలంటే ముందు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి తరువాత నిర్వహించాలే తప్ప ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా వెంటనే పోటీలు అపడమే తప్ప మరో ఉద్దేశం లేద‌న్నారు. మెరుగైన సదుపాయాలు ఉన్న చోటే పోటీలు నిర్వహిస్తామ‌న్నారు. కార్యాలయాలు తరలిపోతున్నాయనే బాధ ఈ ప్రాంత వాసులకు వద్దని..వీలైనంత త్వరగా ఉన్నదికారులతో మాట్లాడి తిరిగి తరలి పోయిన కార్యాలయాలు తీసుకువస్తాన‌ని రామ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో తామంతా వర్గ విభేదాలు లేకుండా అంతా ఒక్క తాటి పై పని చేసి త‌న‌కు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తాన‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement