కలువాయి, : కరోనా సెంకడ్ వేవ్ ముంచుకొస్తున్న వేళ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకొంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ లావణ్య పేర్కొన్నారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మండల అధికారులతో కోవిడ్ నియంత్రణ పై సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలువాయిలోని అన్ని దుకాణాలు ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తీసి వ్యాపారాలు చేసుకోవాలని అనంతరం మూసివేయాలని ఆమె అధికారులకు సూచించారు.మొదట్లో వచ్చిన కరోనా కంటే సెంకడ్ వేవ్ కరోనా అతి ప్రమాదకరంగా ముంచుకొస్తోందని. చాప కింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు.ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైతే తప్పా అనవసరంగా బయటకొచ్చి ముప్పును కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. శానిటైజర్ తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.దగ్గు, జలుబు, జ్వరం లక్షణాల తోపాటు వళ్ళు నొప్పులు, విరోచనాలు తదితర సమస్యలతో బాధపడే వారు దగ్గరలోని ఏఎన్ఎమ్ లకు కానీ, గ్రామంలోని ఆశా కార్యకర్తలకు గానీ తెలియజేయాలన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు కలువాయిలోని ప్రభుత్వ వైద్య శాలకు వెళ్లి కరోనా పరీక్షలు చేయించు కోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వాలైంటర్లు ఎప్పటికప్పుడు దూర ప్రాంతాల నుండి వచ్చిన వారి సమాచారం అందించాలని, కరోనా ఉన్న ఏరియాలో శానిటేషన్ చేయాలనీ ఆమె అధికారులకు సూచించారు.అనంతరం అధికారులతో కలిసి కలువాయమ్మ తల్లి గుడి సమీపంలో ఉన్న బజారు వీధిలోని దుకాణాల యజమానులకు కరోనా పై అవగాహన కల్పించి పలు సూచనలు ఇచ్చారు.ప్రతి యజమాని కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.మండల ప్రజలు అధికారులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో రఫీ ఖాన్, ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ సురేంద్ర బాబు, డాక్టర్ శ్యాం ప్రసాద్,డాక్టర్ అనూష,డాక్టర్ రామ కుమారి ఎస్ఐ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కరోనా సెంకడ్ వేవ్ తో అప్రమత్తంగా ఉండండి
By sree nivas
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Nesw
- ap news today
- awareness
- corona
- nellore latest news
- nellore news
- Nellore News Telugu
- Nellore News Today Live
- Nellore Today News
- Nellore Varthalu
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement