Tuesday, November 26, 2024

సుంకేసులకు పెరిగిన ఫ్లో.. 17 గేట్లు ఓపెన్..

గూడూరు, (ప్రభ న్యూస్‌) : సుంకేశుల జలాశయానికి మరింత భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదితీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలాశయం ఏఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో ఏపీలో తుంగభద్ర నది పై కురిసిన భారీ వర్షాలకు సుంకేశుల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని జ లాశయం ఏఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఇన్‌ప్లో 1,60,800లు క్యూసెక్కులు రాగా 17 గేట్లు ఎత్తి1,58,530 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నది దిగువకు విడుదల చేశామన్నారు. అలాగే కేసీ కెనాల్‌కు 2,270 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని డ్యాంలో 0.400 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. అయితే నదితీర ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో రెండు రోజులు వర్షం ఇలాగే కొనసాగిస్తే మరింత వరదపెరిగే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement