బుచ్చిరెడ్డిపాలెం : విద్యుత్ బిల్లు కాస్త ఆలస్యమైతే విద్యుత్ అధికారులు ఫీజులు తీసుకొని వెళుతున్న సంఘటన బుచ్చిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంటోంది. స్థానికంగా గాంధీనగర్ రామకృష్ణ నగర్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉంటారు. లక్షల రూపాయలు బకాయిలు ఉన్న వారి మీద విద్యుత్ అధికారులు వారి జలుము చూపించకుండా పేదలపై ప్రతాపం చూపిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున బిల్లు కట్టడం ఆలస్యం అయితే స్తంభంలో వైర్లు కట్ చేయడం లేదంటే ఫీజులు తీసుకువెళ్తున్నారంటూ ఆవేదనతో పేర్కొంటున్నారు. విద్యుత్ అధికారులు ఒంటెద్దు పొగడ్లపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు సమస్తులు గ్రామపంచాయతీలు ఇప్పటికే లక్షల్లో బకాయిలు ఉన్న వాటికి ఎందుకు విద్యుత్తు కట్ చేయటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పేదలకు వెసులుబాటు కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement