Friday, November 22, 2024

Nellore: షార్‌లో ఫుడ్ పాయిజన్..ఆస్పత్రుల్లో కూలీలు

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో పనిచేస్తున్న కూలీలు కలుషిత ఆహారం తీసుకుని ఆస్పత్రి పాలయ్యారు. చెడిపోయిన కూరగాయలతో వంట చేసుకోవడం వల్లని ఒకరంటే.. షార్ సమీపంలోని అడవుల్లో దొరికే కాయలు తినడం వలన ఫుడ్ పాయిజన్ అయిందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఫుడ్ పాయిజన్‌తో 18 మంది అస్వస్థతకు గురవ్వగా.. నలుగురిని మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించారు.

షార్‌లో వివిధ ప్రాజెక్టుల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి కొందరు కూలీలు కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు. వీరు సోమవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి దాటాక ఒకరి తర్వాత మరొకరికి వాంతులు, విరేచనాలు కావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వారిని షార్ ఆస్పత్రికి తరలించారు. మొత్తం 18 మంది అస్వస్థతకు గురయ్యారు.. కొందరు పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే వారిని చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.

అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకయ్యిందనే దానిపై స్పష్టత రాలేదు. కొందరు చెడిపోయిన క్యాబేజీతో కూర చేయడం వలన అంటే.. ఇంకొందరు ఏవో మత్తు పదార్థాలు తీసుకోవడం వలన అన్నారు.. మరికొందరు షార్ అడవుల్లో దొరికే కాయలు తినడం వలనే వాంతులు, విరేచనాలు అయ్యాయని చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement