గూడూరు రూరల్: అగ్ని ప్రమాదాల నివారణపై తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అని అగ్నిమాపక అధికారి వై.సుధాకర్ సూచించారు. శనివారం పట్టణ సమీపంలోని పోటుపాలెం ప్రాంతంలో ఉన్న రత్నమ్మ నర్సింగ్ కళాశాల నందు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై విద్యార్థులకు,అధ్యాపకులకు అగ్నిమాపక అధికారులు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి సుధాకర్ మాట్లాడుతూ విద్యా సంస్థలలో అగ్నిప్రమాదాలు వివరణ చర్యలు,ఆస్పత్రులలో ఫైర్ సేఫ్టీ మీద నర్సింగ్ విద్యార్థులకు మాక్ డ్రిల్ తరగతులు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు,అరవింద్ బాబు,వి.హరి బాబు,కృష్ణ ప్రతాప్,కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement