నెల్లూరు – తిరుపతి నుంచి తిరువూరు వస్తున్న ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం, మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద కు AP 39UY 8484 నెంబర్ ఆర్టీసీ బస్సు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం చేయడంతో బస్సులోని ప్రయాణీకులందరూ దిగిపోయారు . ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు.
అయితే ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం అయింది.ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు.. ప్రయాణీకులను వేరే బస్సులో వారి వారి స్వస్థలాలకు పంపారు.