Tuesday, November 26, 2024

AP | రైతులను ముంచిన నకిలీ విత్తనాలు.. కంపెనీ ప్రతినిధుల నిర్బంధం

మనుబోలు (ప్రభన్యూస్) నాణ్యమైన విత్తనాలు,మంచి దిగుబడి వస్తుందంటూ నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టడంతో నిట్ట నిలువునా మునిగిపోయారు. దీనితో కోటి రూపాయల పైగా నష్టపోయామంటూ శుక్రవారం రైతులు ఆందోళన చేసి, కంపెనీ ప్రతినిధుల ను నిర్బంధించారు. ఈ సంఘటన మండలం లోని చెర్లో పల్లి లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. రైతుల కథనం మేరకు గ్రామానికి చెందిన 10 మంది కౌలు రైతులు నెల్లూరు లోని కావేరి సీడ్స్ వద్ద శ్రీ శివనంది ట్రేడర్స్ కి చెందిన బిపిటి వరి విత్తనాలను కొనుగోలు చేశారు.

అప్పట్లో కంపెనీ వారు బీపీటీ బదులు నెల్లూరు మసూర ఇచ్చినట్లుగా వారు తెలిపారు. బస్తా ఒకటి 1450 రూపాయలు లెక్కన కొనుగోలు చేశామన్నారు.వీటిని 250 ఎకరాలలో వీటిని సాగు చేస్తున్నారు. ఇప్పటికీ 25 వేలు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టారు. 70 రోజులకి రావాల్సిన వెన్ను 50 రోజులకే రావటం తో ఆవి నకిలీగా గుర్తించారు.దీనితో దిగుబడి తగ్గిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేరారు.

- Advertisement -

గ్రామానికి చెందిన మల్లూరు నరసయ్య 30 ఎకరాలు పొన్నూరు అశోక్ 20 ఎకరాలు శేషయ్య 25 ఎకరాలు భూతాటి మల్లికార్జున 10 ఎకరాలు హరిబాబు 10 ఎకరాలు మిగతా రైతులతో పాటు గా 250 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తాము ఎకరానికి 40వేలు పైగా నష్టపోయామని మొత్తం మీద కోటి రూపాయలు వరకు నష్టం సంభవించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని లేనిచో ఆత్మహత్యలే శరణ్యమని వారు హెచ్చరించారు. కంపెనీ ప్రతినిధులను నిర్బంధించి వారితో వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరగకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అందుకు కంపెనీ ప్రతినిధులు స్పందించి రైతులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement