వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. బుజబుజ నెల్లూరులో రావుల అనుదీప్ (30)ని గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి హతమార్చిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పొదలకూరుకి చెందిన అనుదీప్ కి పావని అనే మహిళతో వివాహమైంది.. వీరికి పాప సంతానం ఉంది. ప్రస్తుతం బుజబుజ నెల్లూరులో ఉంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనుదీప్ కి పొదలకూరు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆమె భర్తకు తెలియడంతో పథకం ప్రకారం అనుదీప్ ని హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. వేదాయపాలెం స్టేషన్ సీఐ నరసింహారావు మృత దేహాన్ని పరిశీలించి శవ పంచనామ నిమిత్తం జిజిహెచ్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement