సంగం : మండల కేంద్రమైన సంఘం చెక్ పోస్ట్ సమీపంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నదిష అనే విద్యార్థినిపై ఆ పాఠశాలలో పనిచేస్తున్న అవుట్ సోర్స్ టీచర్ దాడి చేయడంతో తీవ్రంగా గాయాలు పాలు అయ్యింది. ఈ విషయాన్ని ఆ పాఠశాల సిబ్బంది బయటకు రానివ్వకుండా చేయడం జరిగింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు గురుకుల సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆ సమయంలో సంఘంలో పోలీస్ స్టేషన్ లో ఎస్సై లేకపోయేసరికి వారు ఆవేదన ఎస్సైకి చెప్పి కంప్లైంట్ చేయాలనే వచ్చిన వారిని సర్దుబాటు చేసి వెనక్కి పంపించినట్లు సమాచారం తెలుస్తుంది. ఇంతలో ప్రిన్సిపల్ హుటాహుటిన అక్కడికి వచ్చి ఇలాంటి పరిస్థితులు పునరాగం కాకుండా జాగ్రత్త పడతామని చెప్పారు.
దాడి చేసిన టీచర్ పై చర్యలు చర్యలేవీ?
విద్యార్థిపై దాడి చేసిన ఔట్ సోర్సింగ్ టీచర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రిన్సిపల్ పై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థిని తల్లిదండ్రులు శ్రీహరి, ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలపై దాడిలు చేసే ఉద్యోగస్తులను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరుతామని వెల్లడించారు. గురుకుల పాఠశాలలో ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల చెడ్డ పేరు వస్తుందని ఖచ్చితంగా ఇలాంటి వారిని సస్పెండ్ చేస్తే తప్ప మరోసారి పునరావృతం కాకుండా ఉంటుందన్నారు.