Friday, November 22, 2024

ప్రజలు నిర్లక్ష్యం వీడకపోతే జరిగే నష్టం వర్ణనాతీతం … డాక్టర్ జి.మైథిలి

గూడూరు రూరల్: ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యం వీడకపోతే జరిగే నష్టం వర్ణనాతీతంగా ఉంటుంద‌ని డాక్ట‌ర్ మైథిలి అన్నారు… పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను అమలు పరిచి ప్రజలు ఇళ్ల వద్దనే ఉండటం వలన కరోనా వైరస్ మరింత విస్తరించకుండా కట్టడి చేయగలమ‌న్నారు.. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎంతో భయంకరంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఎంతోమంది ఈ వైరస్ బారిన పడి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైరస్ దరిచేరకుండా ఉండేందుకు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు,సామాజిక దూరం,శానిటైజర్ లు వంటివి నిత్యం ఉపయోగిస్తూ ఉండాల‌న్నారు.. ముఖ్యంగా ప్రజలు నిర్లక్ష్యం వీడి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల‌ని కోరారు.. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నామ‌ని. మన దరికి కరోనా చేరదులే అన్న ధీమాతో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నార‌ని అయితే.వ్యాక్సిన్ వేయించుకున్న కరోనా వస్తుంద‌ని తేల్చి చెప్పారు. కాకుంటే కరోనా వైరస్ను పోరాడేందుకు మన శరీరంలో వ్యాక్సిన్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంద‌న్నారు. ఎంతో మంది ప్రజలకు రాపిడ్ టెస్ట్,ఆర్టి.పి సి.ఆర్ టెస్ట్ పై అపోహలు ఉన్నాయని రెండు పరీక్షలలో దేనిలోనైనా రిజల్ట్ కచ్చితంగా ఉంటుంద‌న్నారు.ఎంతటి కరోనా సమయంలోనైనా తమ ఆస్పత్రిలో ప్రజలకు,గర్భిణీ స్త్రీలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, అంటూ ఇంతటి తీవ్ర పరిస్థితులలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను విధించడమే ప్రజల ఆరోగ్యాలకు ఎంతో శ్రేయస్కరమ‌ని పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement