సన్నిహిత సంబంధంలో ఏర్పడిన చిన్నపాటి ఆర్థిక వివాదమే ఇద్దరి ఆత్మహత్యకు దారి తీసిన సంఘటన మండల పరిధిలోని మక్తాపురం గ్రామంలో చోటుచేసుకుంది. మక్తాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లునాయు డు(42)కు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన షహీనా(32) కు ఇద్దరు పిల్లలు, భర్త కూడా ఉన్నారు. గత కొంత కాలంగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర నాయుడు తన కుమారుడు వివాహం జరిగే సమయంలో షహీనా వద్ద రూ.50 వేలు తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం షహీనా కుమార్తెకు వివాహం నిశ్చయం కావడంతో వెంకటేశ్వర నాయుడుకు ఇచ్చిన రూ.50 వేలును తిరిగి ఇవ్వాలని ఆమె కోరింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. కాగా వీరిద్దరూ మహాశివరాత్రి రోజును పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ విషయాన్ని ఆ గ్రామానికి ఓ యువకుడు ఆటో డ్రైవర్‌కు వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా రికార్డింగ్ పెట్టారని అది చూసిన ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగిన వారిద్దరిది బుచ్చిరెడ్డిపాళెం వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలో వెంకటేశ్వర్లు నాయుడు మృతిచెందాడు. దీంతో వైద్యుల సూచన మేరకు షహీనాను మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తమ గ్రామానికి చెందిన ఇద్దరు అనూహ్యంగా ఆత్మహ త్య చేసుకుని మృతి చెందడంతో మక్తాపురం గ్రామంలో గంభీర వాతావరణం చోటుచేసుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..