గూడూరు లో కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న కపిల్ చిట్ ఫండ్స్
పాడుకున్న చీటీ దారులకు చెల్లించాల్సిన సొమ్ము 15 నెలలుగా చెల్లించని కపిల్ చిట్
కోట్లరూపాయలు వినియోగదారుల సొమ్ము ఆపేసిన కపిల్ చిట్ ఫండ్స్
కస్టమర్లకు లక్షల్లో సొమ్ము ఇవ్వాల్సి వున్నా పొంతనలేని సమాధానాలు
ఆందోళనలో బాధితులు
గూడూరు – పట్టణంలోని ఐ సి ఎస్ రోడ్ లో ఉన్న కపిల్ చిట్ ఫండ్స్ కంపెనీ బోర్డు తిప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు కపిల్ చిట్ లోని అకౌంట్ దారులు పరిస్థితి చూస్తే పలు అనుమానాలకు తావిస్తున్నాయి, కారణం కపిల్ చిట్ లో చేరి చిట్ లు పాడు కున్న వారికి ఏడాదిన్నర నుండి ఎటువంటి డబ్బులు చెలించ కుండా కాలయాపన చేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కపిల్ చిట్ లో చేరిన ఎంతో మంది వినియోగదారులకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తుంది,చీటీల పేరుతో ఎంతో మంది కస్టమర్లు దాచుకున్న కోట్ల రూపాయల డబ్బును చీటీ పాడుకుని 15 నెలలు పూర్తి కావస్తున్నా చీటీ డబ్బులు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారని శనివారం కపిల్ చిట్ వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు, కపిల్ చిట్ వారు చేసే చేష్టలకు వినియోగదారుల వాపోతున్నారు.
కపిల్ చిట్ లో బాధితుడు అయినా విశ్రాంత ఉపాధ్యాయుడు తన సొంత అవసరాలకు డబ్బులు ఉపయోగపడతాయని కపిల్ చిట్స్ లో డబ్బులు దాచుకోగా చీటీలు పాడి సంవత్సరం దాటినా ఇప్పటికీ తనకు డబ్బులు ఇవ్వడం లేదని ఎన్ని సార్లు కార్యాలయానికి వచ్చినా అక్కడ సిబ్బంది కానీ ఎవరూ కూడా సరిగా సమాధానం చెప్పే వారు లేరని ఆవేదన వ్యక్తంచేశారు.
వయసుభారం పైగాకరోనా పరిస్థితులు దృష్ట్యా తాను తీవ్ర మనోవేదనకు గురౌతున్నానని విశ్రాంతి ఉపాద్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు, కపిల్ చిట్ ఫండ్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుతో తన లాంటి ఎంతో మంది రోడ్డున పడే అవకాశం ఉందని తన బాధను వ్యక్తం చేశారు,గూడూరు నడి బొడ్డున ఉన్న కపిల్ చిట్ ఫండ్స్ మీద ఉన్నతాధికారులు పూర్తివిచారణ జరిపితే కోట్ల రూపాయల దుర్వినియోగం గురుంచి బయటపడే అవకాశం ఉందని బాధితులు చెబుతున్నారు.
2019-2020 సంవత్సరాలు లో చీటి డబ్బులు ఇప్పటికీ ఇవ్వకుండా కపిల్ చిట్ కార్యాలయం చుట్టూ తిరిగి ఎవరికి చెప్పుకోవాలో తెలియక అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అందక,వడ్డీలకు తెచ్చిన డబ్బులు తిరిగి చెల్లించలేక తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నట్లు కపిల్ చిట్ ఫండ్స్ బాధితులు చెబుతున్నారు. కపిల్ చిట్ లో తమ డబ్బులు ఇవ్వకుండా బోర్డు ఎక్కడ తిప్పేస్తారో అనే ఆందోళనలో బాధితులు ఉన్నారు,ఇలా జరిగితే చావే శరణ్యం అని నైరాశ్యంలో ఆవేదన చెందుతున్నారు. కపిల్ చిట్ లో ఒక్కరోజు రోజు చీటీ డబ్బులు కట్టకున్నా మమ్మల్ని వేధించేయాజమాన్యంవినియోగదారుల డబ్బులు మాత్రం సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి ఇవ్వక్కుండా వేదిస్తుండడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. కపిల్ చిట్ వారు వినియోగదారులకు చెల్లించ వలసిన సొమ్ము కపిల్ చిట్ కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేస్తాం అని వారు హెచ్చరించారు,ఉన్నతాధికారులు కపిల్ చిట్ ఫండ్స్ పై పూర్తి విచారణ జరిపి ఎంతోమంది బాధితులను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.