Tuesday, November 26, 2024

ఉత్సాహంగా ఎద్దుల పందాలు

వరికుంటపాడు ఫిబ్రవరి 19 పున్నమి ప్రతినిధి:- వరికుంటపాడు మండల పరిధిలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ త్రిపురేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఎద్దుల పందాలను ఆలయ ధర్మకర్త పెండ్యాల సూర్యనారాయణ టెంకాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతిని అందజేశారు మొదటి బహుమతి కడప జిల్లాకు కాశినాయన మండలానికి చెందిన కామినేని వెంకట సాయి ప్రతాపరెడ్డికి చెందిన ఎద్దులు 644 అడుగులు లాగి విజయం సాధించారు వారికి ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, రాష్ట్ర పీసీసీ సభ్యులు, కామేశ్వరి ఫిలింగ్ స్టేషన్ అధినేత దుద్దుకూరు రమేష్ నాయుడు 30 వేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు అలాగే రెండవ బహుమతి ప్రకాశం జిల్లా పెదారవీడు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన ముద్దపాటి శ్రీనివాసులు ఎద్దులు 614 అడుగులు లాగి విజయం సాధించారు వారికి పెండ్యాల సూర్యనారాయణ 25వేల రూపాయలు నగదు బహుమతిని అందజేశారు ఈ ఎద్దుల పోటీలకు రెండు జతల ఎద్దులు మాత్రమే వచ్చిన కారణంగా మొదటి బహుమతి రెండో బహుమతి అందజేశారు ఈ ఎద్దుల పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిమంది ప్రజలు వీక్షించారు ఈ ఎద్దుల పోటీలకు బందోబస్తుగా ఉదయగిరి ఎస్సై ప్రభాకర్ వరికుంటపాడు హెడ్ కానిస్టేబుల్ నారాయణ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement