Saturday, November 23, 2024

కరోనా రెండో దశ వ్యాప్తి పై అప్రమత్తత అవసరం – డాక్టర్ ప్రమీల రాజకుమారి

చేజర్ల. : కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమతంగా ఉండాలని చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధి కారిణి డాక్టర్ ప్రమీల రాజకుమారి పేర్కొన్నారు. బిల్లు పాడు గ్రామం లో గురువారం ఒక పాజిటివ్ కేసు నమోదు అవడం తో వెంటనే అప్రమత్తమై గ్రామంలో శుక్రవారం 28 మందికి కరోనా పరీక్షలు చేశారు. వాటి ఫలితాలు రెండు రోజుల తర్వాత వెలువడతాయని ఈ సందర్భంగా తెలిపారు. వైరస్ వ్యాధి బారినపడిన వ్యక్తి ఇంట్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి తగు సూచనలు పాటించాలని తెలిపారు. కరోనా వ్యాధి తో భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొందామన్నారు. బయటికి వెళ్లేవారు మాస్కు లు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర ఫార్మసిస్ట్. సిబ్బంది చిన్నయ. ఆశ వర్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement