Saturday, November 23, 2024

ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తున్న సీఎం జ‌గ‌న్ : ఎమ్మెల్యే ప్రసన్న

విడవలూరు (ప్రభ న్యూస్) : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నీతి వంతమైన పాలన అందిస్తున్నారని మాజీ మంత్రి, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. విడవలూరులో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.. ప్రతిపక్షాల‌కు పనిపాట లేదని, తమ పై అసత్య ఆరోపణలు చేయ‌డం అలవాటుగా మారిందని అన్నారు. టీడీపీ నేతలు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోవూరు ఇంచార్జి దినేష్ రెడ్లు తమపై చేసిన ఆరోపణల‌లో వాస్తవం లేదని ప్రసన్న దుయ్యబట్టారు, క‌నిగిరి రిజర్వాయర్ మట్టి త‌ర‌లింపు అనుమతులు మేరకే జరుగుతుంది, అనుమతులు లేని వారిపై చర్యలు తీసుకోవాల‌న్నారు.

ఎమ్మెల్యే ప్రసన్న సవాల్..
అక్రమంగా మట్టిని కనిగిరి రిజర్వాయర్ నుండి అధికార పార్టీ నేతలు హస్తం ఉందని జిల్లా కలెక్టర్ కు పొలంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి నిజాలు లేవని, కేవలం ప్రభుత్వం అనుమతులు మేరకే జగనన్న లే అవుట్లకే మట్టిని రవాణా చేస్తున్నారని కాబట్టి విచారణ జరిపి అనుమతులు లేని వారు ఎవరైనా సరే చర్యలు తీసుకొమని అధికారుల‌కు ఎమ్మెల్యే సూచించారు.

డీసీఎంఎస్ చైర్మెన్ చలపతి టీడీపీపై ఫైర్..
టీడీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు తెలుసుకొని మాట్లాడాలి అని డీసీఎంఎస్ చైర్మెన్ వీరి చలపతి మండిపడ్డారు. టీడీపీ చేసిన తప్పులు తెలుసుకొని మట్టి మాఫియా పై మాట్లాడాలే తప్ప ఇతరులను తప్పుపట్టే నైతిక విలువలు పోలంరెడ్డి, దినేష్ రెడ్లకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు తుమ్మల లక్షయ్య, మాజీ amc పూండ్ల అచ్యుత్ రెడ్డి, కోవూరు నియోజకవర్గం, యువజన విభాగం కమిటీ సభ్యులు, మత్స్య కారనేత ఆవుల వాసు, వైసిపి మండలం అధ్యక్షులు, గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఓగు నాగేశ్వరావు, కమిటీ సభ్యులు, కూనాసి జయ ప్రకాష్, మాజీ సర్పంచ్ సమాధి శ్రీనివాసులు, బెజవాడ వంశీ రెడ్డి పూండ్ల, ప్రవీణ్ రెడ్డి ఎంపీపీ, ఎంపీటీసీ లు, స్థానిక సర్పంచ్ లు ఎంపీడీఓ, తహసీల్దార్, si వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement